ఇవాళా రేపు, ప్రతీ చిన్న విషయానికి ప్రతీ టీవి ఛానెల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో లైవ్ అంటే ప్రత్యక్ష్య ప్రసారం ఇవ్వటం అతి సాధారణం అయ్యిపోయ్యింది. ముఖ్యంగా టీ వీ చానెళ్లు ఎప్పుడూ ఏదో ఒక సంచలన వార్త ప్రసారం చేస్తూ..జనాలను ఆకట్టుకుంటున్నాయి. మరో ప్రక్క సోషల్ మీడియా సైతం సెలబ్రెటీల లైవ్ లు, న్యూస్ లు వంటి వాటితో హల్ చల్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువైపోయింది. తన దైన శైలిలో అబద్దాలో ,నిజాలో తెలియకుండా కామెంట్స్ ,షేర్స్ తో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తోంది.
ఈ నేపధ్యంలో సామాన్యుడు... అసలు తాము విని, చూసి, చదివే వార్తల్లో ఏది నిజం..ఏది అబద్దం, ఏది కరెక్ట్..ఏది తప్పు అర్దంకాని పరిస్దితికి చేరుకున్నాడు. నిష్పక్షపాతంగా వార్తలను ఇస్తూ ముందుకు వెల్తోంది ..దూరదర్శన్ మాత్రమే. వారి ఛానెల్ ని ఇదిగో ఇక్కడ ఈ లింక్ ద్వారా చూసి, ఏ విధమైన ఎవరి ప్రభావం లేని వార్తలు చూడవచ్చు
comments